నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఉపాధ్యాయుల ప్రమోషన్ల కౌన్సిలింగ్ లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కి మాదిగ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో వినతిపత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సిల్మల సురేష్, జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారం జిల్లా అధ్యక్షుడు నూతపల్లి మారుతి మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణలో ఏ, బి, సి, మూడు గ్రూపులు ప్రకారంగా నియమ నిబంధనలకు అనుకూలంగా రోస్టర్ పాయింట్ ను పాటిస్తూ ఉపాధ్యాయుల ప్రమోషన్లను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ప్రమోషన్లలో వర్గీకరణ అమలు చేయడం వల్ల ఎస్సీలలోని అట్టడుగు సమాజానికి సమన్యాయం జరుగుతుందని విజ్ఞాప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల ప్రకారము ప్రమోషన్లు కొనసాగుతాయని తేలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీనివాస్, గద్దల రమేష్, శంకర్, ప్రవీణ్, బబ్లు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్లలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES