డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్‌కు మంద కృష్ణ మాదిగ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళితుడైన కర్ల రాజేశ్ హత్యకు కారకులైన చిలుకూరు ఎస్‌ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ పోలీసులపై హత్య కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన డీజీ (ఇంటిలిజెన్స్) విజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రాజేశ్‌ను పోలీస్‌స్టేషన్లలో బంధించి చిత్రహింసలు పెట్టినందు వల్లే మరణించారని తెలిపారు. ఐదు రోజులపాటు కుటుంబ సభ్యులకు చూపించకుండా ఎందుకు బంధించారో తెలపాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, డీఎస్పీ, చిలుకూరు ఎస్‌ఐ రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వారనీ, ఆ ముగ్గురు ఘటనను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చట్టపరమైన న్యాయం, సహాయం ఇవ్వకుండా రాజీ కుదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వినతిపై డీజీ స్పందిస్తూ, ఘటనపై సమాచారం సేకరించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
కర్ల రాజేశ్ హత్య కారకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



