నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు పై దాడి చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. పట్టణంలోని బి వై నగర్ లో జెండా గద్ద వద్ద ఈనెల 27న అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్ నగర్ కు చెందిన ఆకునూరి కళ్యాణ్ తో తన స్నేహితులు గొడవకు దిగి కులం పేరుతో దూషిస్తూ అతనిపై దాడికి దిగారు. ఈ సంఘటనపై యువకుడి తల్లి పద్మ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో దాడి చిత్రాలు రికార్డు కాగా దాని ఆధారంగా దాడికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించి వారిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. యువకుడి పై దాడికి పాల్పడిన వారు మైనర్లు కావడం గమనార్హం.చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారి పై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



