నవతెలంగాణ – కంఠేశ్వర్ : రాష్ట్ర SC ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం ఉదయం నిజామాబాద్, మధ్యహ్నం కామారెడ్డి జిల్లాలలో పర్యటిస్తున్నారని దళిత బహుజన ఫ్రంట్( డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్,కామారెడ్డి జిల్లా నాయకులు తలారి ప్రభాకర్, డిబిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీబీపేట్ ప్రభాకర్ లు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలక నిజామాబాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి, భూమి సమస్యలు,రూల్ ఆప్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చులు, అన్ని శాఖల సమీక్ష చెస్తారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా స్ధాయి సమీక్ష వుంటదని వివరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటనను సద్వినియోగం చెసుకొని బాధితులు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించవచ్చని తెలిపారు.
రేపు నిజామాబాద్ లో SC ST కమిషన్ చైర్మన్ పర్యటన
- Advertisement -
- Advertisement -