Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ 

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని దామెర భీమనపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కోశాధికారి ఉదావత్ లచ్చిరాం ఆధ్వర్యంలో మండల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ మరియు డైరీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను దశల వారీగా ప్రభుత్వం విడుదల చేయడం సంతోషకరమైన విషయం అని తెలిపారు.ఇకముందు ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతన పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని,సీపీఎస్ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలన్నింటినీ ఒకే విడతలో క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షులు గ్యార వెంకటయ్య,ఉపాధ్యాయులు సంజీవరావు,సికిందర్,ఫరంగి వెంకటయ్య,సభావత్ వెంకట్ కుమార్,కొండ శ్రీనివాస్,స్వరూప,నీలిమ,మంజులత,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -