Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలి..

స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలి..

- Advertisement -

డేమోక్రటివ్ టీచర్స్ పెడరేషన్ నాయకులు..
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు చిలువేరు అశోక్, ఐత తిరుపతిలు ఆదివారం ఒక సంయుక్త  ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ల (స్వచ్ఛ కార్మికులు)ను నియమించిందని, కానీ అకాడమిక్ సంవత్సరం పూర్తి అయినప్పటికీ వారికి ఇప్పటికీ మూడు నెలల వేతనాలు మాత్రమే విడుదల అయ్యాయని పేర్కొన్నారు. ఇంకా ఏడు నెలల వేతనాలు విడుదల కావలసి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తూ పాఠశాలలను శుభ్రం చేస్తున్నారని ,అలాంటి వారికి ప్రతి నెల నెల వారి వేతనాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -