Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బదిలీలు..ప్రమోషన్లతో షెడ్యూల్ విడుదల చేయాలి

బదిలీలు..ప్రమోషన్లతో షెడ్యూల్ విడుదల చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ క్యాడర్ వారి బదిలీలు, ప్రమోషన్లతో కూడిన షెడ్యూల్  విడుదల చేయాలని తపస్ మండల అధ్యక్షులు సల్లూరి కిషన్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా మంగళవారం మండలంలోని వివిధ పాఠశాలల్లో క్యాంపెనింగ్ చేస్తూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో ముఖాముఖిగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా పీజీహెచ్ఎం లకు

 బదిలీలు, స్కూల్ అసిస్టెంట్లకు పిజిహెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇలా కేడర్ వారీగా బదిలీ, ప్రమోషన్లతో ఉపాధ్యాయ వర్గానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తపస్ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బషీరాబాద్ పాఠశాల పిజిహెచ్ఎం గంగాధర్, తపస్ మండల కార్యదర్శి రమేష్, డివిజన్ కార్యదర్శి శంకర్ గౌడ్, క్యాషియర్ మారుతి, కార్యదర్శి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -