సిఐటియు డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
స్కీం వర్కర్లను కార్మికులు గా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి అని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా మహాసభ సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు దేవగంగు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా జెండాను ఎగరవేసిన అనంతరం జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ మరియు నూర్జహాన్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో కానీ, కనీస వేతనాలు అమలు చేయడంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడంతో అంగన్వాడి ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అంగన్వాడీ ఉద్యోగులను మరియు స్కీం వర్కర్లను ఉద్యోగులుగా కార్మికులుగా గుర్తించకపోవడంతో ఉద్యోగ భద్రత లేకపోగా కనీస వేతనాలు అమలు కాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలన్నీ ఎదుర్కొంటున్నాయని వారు అన్నారు.
కనీస వేతనాలు అమ్మలకు చేయకపోగా కార్మిక చట్టాలు ఏవి వర్తించక శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారు విమర్శించారు కార్మిక వర్గం కలిసి ఉన్నప్పుడే నువ్వు పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో తెచ్చిన సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని వారు అన్నారు. అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రిటైర్ అయిన అంగన్వాడీ ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోగా పనిగంటలను పెంచడంతోపాటు అంగన్వాడీ ఉద్యోగుల పైన పని భారాన్ని విపరీతంగా మోపుతున్నారని సమస్యలను ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపుకు అధికారులు పాల్పడుతున్నారని ఈ విధానాలను ఎదిరించకపోతే రాబోయే కాలంలో అంగన్వాడీ ఉద్యోగులు మరింత దోపిడీకి గురవుతారని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఐక్య పోరాటాలను నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
స్కీమ్ వర్కర్ల పేరుతో సమస్యలను ఎదుర్కొంటున్నామని శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఇటీవల అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించిన వారికి వెంటనే ఉద్యోగం కల్పించాలని , రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యూటీ పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని, మినీ వర్కర్ల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ గత మూడు సంవత్సరాల కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. కార్యదర్శి నివేదిక పైన చర్చలు జరిపిన అనంతరం వాటిపై రిపోర్టును ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు చంద్రకళ, మంగాదేవి, సూర్య కళ, రాజ్యలక్ష్మి, వాణి, గోదావరి, జ్యోతి, జగదాంబ తదితరులు పాల్గొన్నారు. మహాసభలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిరుపలింగం పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జంగం గంగాధర్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.
స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES