Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపథకాలు నిర్వీర్యం... అభివృద్ధి గల్లంతు

పథకాలు నిర్వీర్యం… అభివృద్ధి గల్లంతు

- Advertisement -

– బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే : సదాశివపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-సదాశివపేట

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథ కాలు నిర్వీర్యమవుతున్నాయని, పట్టణ అభివృద్ధి గల్లంతవుతుందని మాజీ మంత్రి హారీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హరీశ్‌రావు కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో సదాశివపేట పట్టణం అభివద్ధి పథంలో పరుగులు పెట్టిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. మాటల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. సదాశివపేట అభివృద్ధి విషయంలో బీజేపీకి చెప్పుకొనే ఒక్క పని కూడా లేదని, బీజేపీకి ఓటు వేయడం మోరీలో ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. రాబోయే పురపాలక ఎన్నికల్లో అభివద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ మాట్లాడుతూ సదాశివపేట మున్సిపల్‌ పట్టణాభివృద్ధి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఏలాంటి అభివృద్ధి పనులు లేవన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ మటం బిక్షపతి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ చింత గోపాల్‌, రాష్ట్ర నాయకుడు శివరాజ్‌పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -