Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అథ్లెటిక్స్ లో ఉప్పల్ వాయి గురుకుల విద్యార్థులకు పథకాలు 

అథ్లెటిక్స్ లో ఉప్పల్ వాయి గురుకుల విద్యార్థులకు పథకాలు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు పాల్గొని ప్రతిభను చూపి, పథకాలు సాధించినందుకు గురువారం క్రీడాకారులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తదితరులు అభినందించారు. జావలిన్ త్రో లో కే ఆనంద్ బంగారు పతకం, 1 కిలోమీటర్ పరుగు పందెంలో టి కేదార్ సింగ్ బంగారు పతకం, షాట్ పుట్ లో ఏ సంకేత్ బంగారు పథకం, లాంగ్ జంప్ లో టీ చరణ్ బంగారు పతకం, 600 మీటర్ల పరుగు పందెంలో ఎన్. అరవింద్ రజిత పథకం, ట్రై అథలిన్ లో జే శ్రీ సాయి కాంస్య పథకం సాధించారు. ఈనెల 3, నాలుగు తేదీల్లో హనుమకొండలో జీఎం స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు కే ఆనంద్, టీ కేదార్ సింగ్, టీ చరణ్, ఎంపికైనట్లు పిడి లింగం తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరాం, వైస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పి ఈ టి రవీందర్, కోచ్ సురేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -