Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలురక్తదానం చేసిన స్కూల్ బస్ డ్రైవర్

రక్తదానం చేసిన స్కూల్ బస్ డ్రైవర్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న సాగరిక అనే మహిళకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించడంతో కామారెడ్డి లో గల బి టాపర్ స్కూల్ డ్రైవర్ షేక్ అజీమ్ పాషా సహకారంతో వారికి  ఓ పాజిటివ్  రక్తం సకాలంలో అందచేయడం జరిగిందనీ రక్తదాతల సేవా సమితి సర్వాకులు తెలిపారు. ఎప్పుడంటే అప్పుడు వచ్చి రక్తం ఇస్తూ సాటి మనిషి ప్రాణాలను కాపాడటంలో కామారెడ్డి రక్తదాతల సేవా సమితి   రాష్ట్రంల్లోనే ఆదర్షంగా నిలుస్తుంది అన్నారు.

ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని ఈ సందర్భంగా యువకులను కోరుతున్నామన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసి  కామారెడ్డి డ్రైవర్లకే ఆదర్శంగా నిలిచిన  అజీమ్ ను జిల్లా రక్తధాతల సేవా సమితి  నిర్వాహకులు  బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్  లు అభినందించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ గుండెల్లి ప్రశాంత్, ప్రసాద్, పేషంట్ కుటుంబసభ్యులు , కెబిఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -