Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల బస్సు డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలి : కమిషనర్ వాణి

పాఠశాలల బస్సు డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలి : కమిషనర్ వాణి

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ : ప్రయివేటు పాఠశాలల బస్సు డ్రైవర్లు క్రమశిక్షణతో, జాగ్రత్తగా బస్సులను నడపాలని జిల్లా ట్రాన్స్ పోర్టు కమిషనర్ వాణి అన్నారు. శనివారం ట్రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రయివేటు పాఠశాలల బస్సుల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రయివేటు పాఠశాలల బస్సు డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడుపుతూ విద్యార్ధులను సురక్షితంగా వారి ఇంటి వద్ద దింపి తిరిగి పాఠశాలకు తీసుకురావాలన్నారు. బస్సు నడిపే సమయంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని, ఓవర్ స్పీడ్ తో వెళ్లకూడదని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ వి.చంద్రశేఖర్, మోటార్ వెహికిల్ సిబ్బంది స్వప్న, కె. శ్రీనివాస్, సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు వంగాల నిరంజన్రెడ్డి, శ్రీనివాస్లెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాసచారి, పట్టణ అధ్యక్షుడు వరప్రసాద్, సెక్రటరీ ఓరుగంటి శ్యాంసుందర్, శ్రీధర్రెడ్డి, ముధసూదన్ రెడ్డి, అమరేందర్రెడ్డి, నర్సిరెడ్డి, వెంకట్, సలీం, దామోదర్, సురేందర్రెడ్డి, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -