Tuesday, December 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాఠశాల బస్సు బోల్తా..విద్యార్థులకు గాయాలు

పాఠశాల బస్సు బోల్తా..విద్యార్థులకు గాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఉండ్రాజవరం మండలం తాటిపర్రులోని జ్యోతి స్కూల్‌కి చెందిన 25 మంది విద్యార్థులతో వెళ్తోన్న బస్సు.. ఏటిగట్టుపై మలుపు తిప్పుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఓ విద్యార్థిని కాలికి తీవ్ర గాయం కావడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బస్సు పల్టీ కొట్టడంతో విద్యార్థులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -