- Advertisement -
నవతెలంగాణ మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ని చెరువు నిండి అలుగు పారుతోంది. మక్తల్ నుంచి అనుగొండకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దాదాపు పది గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహాన్ని దాటుతుండగా ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు నీటిలో ఆగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే బస్సును ముందుకు తోసి ఒడ్డుకు చేర్చారు. దీంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది.
- Advertisement -