Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమతులు లేకుండానే పాఠశాల నిర్మాణం

అనుమతులు లేకుండానే పాఠశాల నిర్మాణం

- Advertisement -

ఒకే నెంబర్ పై16 నుండి 18 రేకుల షెడ్ల నిర్మాణం 
1ఎకరం 14 గుంటలో సెయింట్ మేరీ స్కూల్
కాట్రపల్లి గ్రామపంచాయతీ ఆదాయానికి గండి
స్కూల్ నిర్మాణానికి డీటీసీపీ పరిమిషన్ తీసుకొని వైనం
నవతెలంగాణ – రాయపర్తి : వ్యాపార ధోరణితో నడుస్తున్న విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారే తప్ప వారు ప్రభుత్వం నుండి తీసుకునే అనుమతుల విషయంలో జగనామం పెడుతున్నారు. ప్రజాసేవ చేస్తున్నామని బిల్డప్పులు ఇస్తున్న స్కూల్ నిర్వాహకులు ఇష్టారీతిగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద డబ్బులు దండుకుంటూ… అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని సెయింట్ మేరీ హై స్కూల్ నిర్మాణం 2011 సంవత్సరంలో  నిర్మాణం మొదలు పెట్టగా 2013 సంవత్సరం నుండి పాఠశాల నిర్వహించబడుతుంది. అప్పట్లో గ్రామపంచాయతీలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా 6 – 91/2 నెంబర్ కేటాయించారు. ఇదే అదునుగా భావించి స్కూల్ నిర్వాహకులు దశలవారీగా 1 ఎకరం 14 గుంటల వ్యవసాయ భూమిలో 16 నుండి 18 రేకుల షెడ్ల నిర్మాణం చేపట్టారు.  సర్వే నెంబర్ 106/డి/1/1లో నిర్మాణాలు చేపట్టారే తప్ప డిటిసిపి(డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పర్మిషన్ తీసుకున్న దాఖలాలు లేవు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పాఠశాల నిర్మాణం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దాటవేసే సమాధానాలు చెబుతూ కాలం వెలదీస్తున్నారు. 2024 – 2025 సంవత్సరానికి గాను కాట్రపల్లి గ్రామపంచాయతీకి నామమాత్రంగా 4692  రూపాయలను చెల్లించారు. కాట్రపల్లి గ్రామపంచాయతీలో సెయింట్ మేరీ హై స్కూల్ నిర్మాణానికి తీసుకున్న పర్మిషన్ వివరాలు కూడా లేకపోవడం శోచనీయం. ఎలాంటి అనుమతులు లేకుండానే స్కూలుకు మూడు విద్యుత్ మీటర్లు ఎలా ఇచ్చారు? వ్యవసాయ భూమిని నాలా కన్వర్ట్ చేసుకున్నారా లేదా? స్కూలు ప్రాంగణంలో ఎన్ని తరగతి గదులు ఉన్నాయి ఎన్నిటికి గ్రామపంచాయతీ పర్మిషన్ ఇచ్చింది? అనే వివరాలను తెలియనీవ్వకుండ గోప్యంగా ఉంచడంతో స్థానికులో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -