వర్థమాన అథ్లెట్లకు ఇదో చక్కటి వేదిక : అభిషేక్ రెడ్డి కంకణాల
నవతెలంగాణ-హైదరాబాద్ : స్కూల్ స్థాయిలో 56 జట్లు (బార్సు, గర్ల్స్) ఐదు వారాల పాటు అరంగేట్ర హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ వర్శిటీ వాలీబాల్ లీగ్ 2025 టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ప్రైమ్‌వాలీబాల్ లీగ్ ప్రాంఛైజీ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ క్షేత్రస్థాయిలో వాలీబాల్‌ను అభివృద్ది చేసేందుకు వర్శిటీ లీగ్‌తో చేతులు కలిపింది. పాఠశాల స్థాయిలోనే ప్రతిభావంతులను వెలికితీసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యూసుఫ్‌గూడలోని ఇండోర్ స్టేడియంలో శనివారం స్కూల్ వాలీబాల్ లీగ్ ఆరంభమైంది. శనివారం జరిగిన పోటీల్లో బాలికల విభాగంలో శ్రీనిధి స్కూల్, డిపిఎస్ నాదర్‌గుల్, చిరాక్ ఐఎస్‌ఆర్‌పీ, సిల్వర్ ఓక్స్ స్కూల్, సమస్థి స్కూల్, ఇండస్ స్కూల్, సంక్టా మారియ స్కూల్‌లు లీగ్ దశ పోటీలకు అర్హత సాధించాయి. ‘తెలంగాణలో ప్రతిభావంతులకు కొదవ లేదు. వర్థమాన అథ్లెట్లు పాఠశాల స్థాయిలో సత్తా చాటేందుకు వర్శిటీ లీగ్ ఓ చక్కటి వేదిక. లీగ్‌లో నాణ్యమైన ఆటగాళ్లను బ్లాక్‌హాక్స్ అకాడమీకి ఎంపిక చేసి, ప్రపంచ స్థాయి తర్ఫీదు అందిస్తామని’ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. ఐబీ, సిబీఎస్‌ఈ స్కూల్స్‌లో సుమారు 85000 విద్యార్థుల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న 56 జట్లు పోటీలో నిలువటంతో యూసుఫ్‌గూడలోని కోట్ల విజరుభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద సందడి నెలకొంది. క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, వాలీబాల్ అభిమానులతో స్టేడియంలో పండుగ వాతావరణం కనిపించింది.
స్కూల్ వాలీబాల్ లీగ్ షురూ
- Advertisement -
- Advertisement -