- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శాంభవి హైస్కూల్లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తిని పెంపొందించేందుకు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు సైన్స్కు సంబంధించి వివిధ ప్రాజెక్టువర్క్ లను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు,కరస్పాండెంట్ బొట్ల రవీణ్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



