నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంలోని వివేక నంద ఉన్నత పాఠశాల, చించోలి(బి) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల,మైనార్టీ గురుకులు బాలుర,బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టుల వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీ, ఉపన్యాస పోటీ నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ వెన్నెల సాయన్న, ప్రధానోపాధ్యాయులు మునిందర్ రాజు, విమల, మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఫిరోజ్,రహద్ లు విద్యార్థులు ఉపాధ్యాలు పాల్గొన్నారు.



