Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు, వ్యాసరచన, ఉపన్యాసం, సైన్స్ రంగోలి, వివిధ సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజాగంగా రెడ్డి విద్యార్థులను అభినందించారు. అనంతరం వివిధ పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -