Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ ఉన్నత పాఠశాలలో సైన్స్  మేళా

కోనాపూర్ ఉన్నత పాఠశాలలో సైన్స్  మేళా

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని ముందస్తు సైన్స్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ మేళాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పంకు చెందిన అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్  వారిచే పాఠశాలకు అందజేయబడిన సైన్స్ కిట్ పరికరాలతో తయారు చేసిన సైన్స్ ఉపకరణాలను విద్యార్థులు ప్రదర్శించారు.6 నుండి10వ తరగతుల జీవశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము సబ్జెక్టుల్లో 100 ప్రయోగాలను విద్యార్థులు తయారు చేశారు.

మానవవ ఆస్తిపంజరం నమూనా, పుర్రె నమునా, లేజర్ లైట్, ఆహారపు గొలుసు, వివిధ రకాల జంతువుల చిత్రాలు, బ్యాటరీ, కాంతి అనువర్తనాలు మొదలైనవి విద్యార్థులు సైన్స్ మేళాలో ప్రదర్శించారు. విద్యార్థు తాము ప్రదర్శించిన పరికరాల ఉపయోగాలను తోట విద్యార్థులకు వివరించారు. సైన్స్ మేళలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ అభినందించారు.  కార్యక్రమంలో  సైన్స్ ఉపాధ్యాయులు రామకృష్ణ, భాస్కర్, రాజా రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -