నవతెలంగాణ-రామారెడ్డి
సైన్స్ ఫెయిర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో రెండవ రోజు గణితమేళా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజు మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత తెలుస్తుందని అన్నారు. వివిధ పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ను వీక్షించి , కొత్త విషయాలు తెలుసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణమాచార్యులు, గంగారెడ్డి, పరిష్కారం రెడ్డి, గీ రెడ్డి రాజిరెడ్డి, రంజిత్ మోహన్, గోవర్ధన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ నాగభూషణం, అక్కడ మీకు ప్రిన్సిపల్ నాగేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ఫెయిర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది: డీఈవో రాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES