Sunday, February 22, 2026
E-PAPER
Homeసందర్భంసైన్స్‌… మనిషి ఆలోచనా విధానంలో భాగం…

సైన్స్‌… మనిషి ఆలోచనా విధానంలో భాగం…

- Advertisement -

”సైన్స్‌ అనేది కేవలం ప్రయోగశాలలకు పరిమితం కాకూడదు, అది మనిషి ఆలోచనా విధానంలో భాగం కావాలి.” – సర్‌ సీవీ రామన్‌
1921లో ఆయన లండన్‌ నుండి ఓడలో తిరిగి వస్తున్నప్పుడు, ”సముద్రపు నీరు నీలం రంగులో ఎందుకు ఉంటుంది?” అనే సందేహం కలిగింది. అప్పటి వరకు ఆకాశం నీలిరంగు ప్రతిబింబం వల్లే నీరు అలా ఉంటుందని నమ్మేవారు. కానీ రామన్‌ దీనిని తప్పు అని నిరూపిస్తూ కాంతి విక్షేపణం (Light Scattering) పై పరిశోధనలు చేశారు. భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో ఈయన అగ్రగణ్యుడు.

వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్‌ రావడం గగనం. సర్‌ సీవీ రామన్‌ ఆ ఘనత సాధించి చరిత్ర పుటల్లో నిలిచారు. విజ్ఞాన శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న ఏకైక ఆసియా వాసిగా చరిత్ర సష్టించారు. కాంతి ఒక పారదర్శక పదార్థం గుండా ప్రయాణించినప్పుడు, దానిలోని కొన్ని కిరణాలు వేరే తరంగదైర్ఘ్యం (Wavelength) తో విక్షేపణం చెందుతాయి. దీనినే ‘రామన్‌ ఎఫెక్ట్‌’ అంటారు. ఆయన రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టడానికి వాడిన పరికరాల ఖరీదు అప్పట్లో కేవలం 200 రూపాయలు మాత్రమే.

రామన్‌ ఎఫెక్ట్‌ కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, నేడు దీనిని ఎన్నో రంగాలలో వాడుతున్నారు. మందుల స్వచ్ఛతను పరీక్షించడానికి., ఘటనా స్థలంలో దొరికిన రసాయనాలను లేదా డ్రగ్స్‌ను గుర్తించడానికి. విమానాశ్రయాల్లో పేలుడు పదార్థాలను స్కాన్‌ చేయడానికి ‘రామన్‌ స్పెక్ట్రోస్కోపీ’ వాడుతారు. వజ్రాలు., ఇతర రత్నాల నాణ్యతను పరీక్షించడానికి వాడుతున్నారు. రామన్‌ ఈ ఆవిష్కరణను చేసినప్పుడు కేవలం ఒక సూర్యరశ్మి, మెర్క్యురీ ల్యాంప్‌., కొన్ని లెన్స్‌ లను మాత్రమే వాడారు. నేడు ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి వెన్నెముకగా నిలిచింది.

‘చంద్రశేఖర వెంకట రామన్‌’ – వెదజల్లుతున్న ఫోటాన్‌ల మార్గాన్ని విచ్ఛిన్నం చేసే దగ్విషయాన్ని కనుగొన్న ప్పుడు ‘రామన్‌ ఎఫెక్ట్‌’ గా రూపొందించబడింది. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్‌ ఎఫెక్ట్‌ ద్వారా నిరూపించారు. ఈ దగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెల్లడించారు.
ఈ అద్భుత ఆవిష్కరణను పురస్కరించుకుని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (NCSTC)) జాతీయ సైన్స్‌ దినోత్సవంగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

సమాజానికి శాస్త్రవేత్తలు, పరిశోధకుల గణనీయమైన కషిని గుర్తించడానికి, అభినందించడానికి, శాస్త్రీయ దక్పథాన్ని ప్రోత్సహించడానికి, ఆలోచనను ప్రోత్సహించడానికి, జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ఎంటంటే – ముఖ్యంగా రోజువారీ జీవితంలో సైన్స్‌ ప్రాముఖ్యత.. దాని ఉపయోగాలను ప్రజలలో వ్యాప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాంకేతిక విద్య, నైపుణ్యాల వద్ధి, భవిష్యత్‌లో సైన్స్‌ పరంగా సాధించాల్సిన ప్రగతి పరంగా విద్యార్థులు, యువతను ప్రోత్సహించడం. అలాగే సర్‌ సీవీ రామన్‌ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానికి ప్రదర్శనలు నిర్వహిస్తూ విద్యార్ధులను ప్రోత్సహించడమే లక్ష్యంగా జాతీయ సైన్స్‌ డే ను నిర్వహించడం వస్తోంది.

ఆవిష్కరణల ప్రాముఖ్యతను జీవితాలపై చూపే ప్రభావాన్ని గుర్తుచేసే విధంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం ఉపయోగపడుతుంది. ఉపన్యాసాలు, సెమినార్లు, ప్రదర్శనలు పోటీలతో సహా వివిధ కార్యక్రమాలు కార్యకలాపాల ద్వారా ఈ రోజు జరుపుకుంటారు. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్‌ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది.
దైనందిన జీవితంలో సైన్స్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక ప్రపంచంలో సైన్స్‌ లేని జీవితాన్ని ఊహించలేము. సైన్స్‌ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది. నడిపిస్తున్నది. వ్యాక్సిన్‌ల అభివద్ధి నుండి మహమ్మారిని ఎదుర్కోవడం, వాతావరణ మార్పులకు పరిష్కారాలను కనుగొనడం, సైన్స్‌ మనకు మంచి భవిష్యత్తు కోసం ఆశను అందిస్తూనే ఉంది.

”నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి” అంటూ సర్‌ సీవి రామన్‌ చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో ఎప్పుడైనా గమనించారా? వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే ”విజ్ఞానం అత్యుత్తమైన సజనాత్మక కళారూపం” అని రామన్‌ ఎప్పుడూ చెబుతుండేవారు.
సైన్సు రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్‌ ను శక్తివంతగా చూపించారు. ఆప్పట్లోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్‌ సివి రామన్‌.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్‌ అయ్యర్‌, పార్వతి అమ్మాళ్‌ దంపతులకు 1888 నవంబరు 7న జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన రామన్‌.. చిన్నప్పటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఆసక్తిని చూపేవారు. రామన్‌ తండ్రి భౌతికశాస్త్ర టీచర్‌ కావడంతో దానిపై మరింత కుతూహలం పెంచుకొని తన 12వ ఏట మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి ఫిజిక్స్‌ గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఆ తర్వాత మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఆ సబ్జెక్టులో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్‌ అందుకున్న విజ్ఞాన ఖని .ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి శాస్త్రవేత్త. వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడు… ఆద్యుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్‌ సీవి రామన్‌ అగ్రగణ్యుడు. భారతరత్న (1954) భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం.
పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సు లో చూపించాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్‌ ఎఫెక్టు ఆవిష్కరించడం జరిగింది.

ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్‌ ప్రభుత్వం 1929 లో నైట్‌ హుడ్‌ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్‌ ఎఫెక్టు అసామాన్యమైనదని, అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్‌ ను అభినందించారు. ఈ పరిశోధనకు 1930లో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి ప్రధానం చేసింది. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. తబలా, మదంగం వంటి వాయిద్యాల నుండి వచ్చే ధ్వని తరంగాలపై కూడా ఆయన శాస్త్రీయ పరిశోధనలు చేశారు.
భారత ప్రభుత్వం 1954లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఇది కాకుండా మరో పురస్కారం లెనిన్‌ శాంతి బహుమతి (1957) అందుకున్న మహానుభావుడాయన. చివరి వరకు సైన్స్‌ అభివద్ధికి పాటుపడ్డ సీవీ రామన్‌ 1970 నవంబర్‌ 21న కన్నుమాశారు.

2026 థీమ్‌ (అంశం) : ఏటా ఒక్కో ‘థీమ్‌’తో జాతీయ సైన్స దినోత్సవం జరుపుతుంటారు. ఈ ఏడాది ”సైన్స్‌ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించడం’ (Fostering Public Trust in Science). ‘థీమ్‌’ను తీసుకున్నారు. ఇది శాస్త్రీయ దక్పథాన్ని ప్రోత్సహించడం., దేశాభివద్ధిలో సైన్స్‌ పాత్రను గుర్తించడంపై దష్టి పెడుతుంది. సామర్థ్యంలో చిక్కుముడులను విప్పడానికి జ్ఞానాన్ని మరింత ప్రోత్సహించడం కోసం ఈ తరహా అంశాలను ఎంపిక చేస్తూ ఉంటారు.
2025 థీమ్‌ (గత ఏడాది): ”వికసిత్‌ భారత్‌ కోసం సైన్స్‌ డ ఇన్నోవేషన్‌లో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ దిశగా భారతీయ యువతను శక్తివంతం చేయడం” (Empowering Indian Youth for Global Leadership in Science and Innovation for Viksit Bharat).
విశ్వంపై అవగాహనకు దోహదపడిన మార్గాల్లో జీవితాలను మెరుగుపరిచేందుకు సహాయపడిన శాస్త్రవేత్తలు., పరిశోధకుల విజయాలను గుర్తు చేసుకుంటూ దినోత్సవాలను వేడుకల్లా జరుపుకోవడమే శాస్త్రవేత్తలకి మనమిచ్చే నివాళి.

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008 577 834

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -