Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుభీంగల్ లో సైన్స్ సెమినార్

భీంగల్ లో సైన్స్ సెమినార్

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్

భీంగల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ‘క్వాంటమ్ యుగం సాంభవ్యత, సవాళ్లను ప్రారంభిస్తుంది` అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో మెండోరా గ్రామానికి చెందిన ఏ.ఆర్తి జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్ధిని ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానం బడ భీంగల్ పాఠశాలకు చెందిన డి.ఐశ్వర్య నిలిచారు. గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో, శాలువాతో మండల విద్యాధికారి డి.స్వామి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింబాద్రి, శ్రీధర్, గంగ మోహన్, ఆనంద్, భూమేశ్వర్, శ్రీనివాస్, అనురాధ మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -