నవతెలంగాణ – భీంగల్ : రాష్ట్రంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుంచి ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టిన విషయం తెలిసిందే. అ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలంలోని చెంగల్ గ్రామం నందు బి. సౌందర్య, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రాంతీయ వరి పరిశోధన స్థానం రుద్రూర్, కె, వెంకట్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల, రుద్రూర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారి అనుబంధంతో రైతులకు ఈ క్రింద తెలియపరిచిన వివిధ అంశాల పైన అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడండి- సాగు ఖర్చు తగ్గించండి. భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భాస్వరం ఎరువులను దుక్కి లో మాత్రమే వేసుకోవాలి. పైపాటు గా వేయకూడదు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి -నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడలని, రసాయన పురుగు మందులను సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వాడండి. గ్రామంలో శాస్త్రవేత్తల బృందాలు పర్యటించి.. రైతులకు సాగు మెళకువలు, విత్తనోత్పత్తి, సస్యరక్షణ చర్యలు, నీటి నిర్వహణ సహా అనేక అంశాలపై అవగాహన కల్పించారు. అవసరమైనప్పుడు మాత్రమే పురుగు మందులను వాడాలని సూచించారు.
రసీదులను భద్రపరచండి- కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందండి : నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, లేదా పురుగుమందులు కొనుగోలు చేసినట్లయితే, రసీదులతో విక్రేత వద్ద ఫిర్యాదు చేయవచ్చు. రశీదు రుజువుగా చూపించడం ద్వారా రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ పొందవచ్చు. ఉదాహరణకు, విత్తనాలు మొలకెత్తకపోతే లేదా పురుగుమందు పనిచేయకపోతే, రశీదుతో వినియోగదారులు కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. సాగు నీటిని ఆదా చేయండి -భావితరాలకు అందించండి: వరి పంటలో తడి పొడి విధానంతో నీటి యాజమాన్యం చేసినట్లయితే 15 నుంచి 30% నీటిని ఆదా చేయవచ్చు, ఈ పద్ధతిలో నీటి ఆదాతో పాటు భూసారాన్ని కాపాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. మొక్కజొన్నలో జంట చాళ్ల పద్ధతిలో బిందు సేద్యం ద్వారా సాగు చేసినట్లయితే నీటిని ఆదా చేయవచ్చు. మొక్కజొన్న సాగులో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వరుస విడిచి వరుస పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు.
పంట మార్పిడి పాటించండి -సుస్థిర ఆదాయాన్ని పొందండి: పంట వైవిధ్యీకరణ అనేది రైతులు ఒకే తరహా పంటలు పెంచడం కాకుండా, వేరే వేరే రకాల పంటలను సాగు చేయడం అనగా ప్రస్తుతం పాటిస్తున్న పంట సరళిలో అధిక పోషక విలువలు, అధిక దిగుబడి మరియు నేల సారాన్ని పెంపొందించే పంటలను చేర్చడం. పంట వైవిధ్యీకరణను అనుసరించడం వలన పంట సరళిలో ఉత్తమమైన మార్పులు రావటంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా చేకూరుతుంది. దీనిలో భాగంగా వివిధ రకాలైన పప్పు జాతి పంటలు, నూనె గింజల పంటలు తదితరాలను సాగు చేయాలి. ఇలా చేయడం వలన నేల పౌష్టికత మెరుగుపడుతుంది.
చెట్లను పెంచండి- పర్యావరణాన్ని కాపాడండి: భూమిపై జీవుల మనుగడ సాగించడానికి చెట్లు చాలా అవసరం. అవి మన పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. చెట్లు మనకు అనేక విధాలుగా సహాయపడతాయి. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. చెట్లు గాలిలోని కాలుష్య కారకాలను గ్రహించి గాలిని శుద్ధి చేస్తాయి. చెట్లు అనేక రకాల జీవులకు ఆవాసాన్ని కల్పిస్తాయి, తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడతాయి. చెట్లు భూగర్భ జలాల నిల్వ మరియు నీటి వనరులను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి లావణ్య, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు డి. స్నేహ, భార్గవ్, దివ్య, మౌనిక, అరవింద్, డాక్టర్ రోహిత్ రెడ్డి జిల్లా పశువైద్య ఉమ్మడి వైద్యుడు, డాక్టర్ సిహెచ్. కృష్ణ చైతన్య ఏ వి ఎస్. ఏ ఎమ్ సి సభ్యులు నర్సాపురం జీవన్,కుంట రమేష్ , జె.జె. నర్సయ్య, అనంత్ రావు ,మోతె శ్రీనివాస్,నుతులా వసంత్ రెడ్డి,దుమాల రాజు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES