నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” మే నెల 5 వ తేది నుండి జూన్ 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుందని ఏరువాక కేంద్రం,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. బి.అనిల్ కుమార్ తెలిపారు.ఈ నెల రోజుల కార్యక్రమములో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 6 రోజులు వారానికి ఒక గ్రామము చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.07-05-2025 నాడు వీరివెల్లి గ్రామంలో, 14-05-2025 నాడు, చందుపట్ల గ్రామము లో,21-05-2025 నాడు అనాజిపురం గ్రామంలో,28-05-2025 నాడు మోటకొండూరులో,04-06-2025 నాడు బొమ్మాయిపల్లిలో,11-06-2025 నాడు తుక్కాపురం గ్రామములో,రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాల్లో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.అనిల్ కుమార్, బి రాజా మధుశేఖర్, సంబధిత వ్యవసాయ శాఖ అధికారులు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు, వివిధ ప్రభుత్వ కార్యాలయ అధికారులు, గ్రామంలోని పాఠశాల విద్యార్థులు పాల్గొంటారు. ప్రతి గ్రామంలో ప్రధానంగా 6 అంశాలను వివరిస్తారు.
1.అనవసర అధిక యూరియా వినియోగాన్ని తగ్గించి,సాగు ఖర్చును తగ్గించుట.
2. అవసరం మేరకే రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం.
3. విక్రయ కేంద్రాల్లోని రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందడం.
4. సాగునీటిని ఆదాచేసి, భావితరాలకు అందించడం.
5.పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందడం.
6. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడటం.
మే 5 నుంచి జూన్ 13 వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES