శాస్త్రీయంగా నిర్ధారిస్తారు…
ఐఐఓపీఆర్ ప్రధాన శాస్త్రవేత్త ఎంవీ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎట్టకేలకు పామాయిల్ రైతులు ఆవేదనకు పరిష్కారం దొరకనున్నది. ఎదిగీ ఎదగని మొక్కలు, కాచి కాయని చెట్లు, బరువు రాని పామాయిల్ గెలలతో సతమతం అవుతున్న రైతులు పక్షాన పోరాడిన ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీకి కొంత ఊరట లభించనున్నది. అశ్వారావుపేట మండలంలోని వంద్యత్వ మొక్కలు ఉన్నట్లుగా భావిస్తున్న నున్నా కృష్ణ, కుంచం సుబ్బారావు, ఆళ్ళ నాగేశ్వరరావు పామాయిల్ క్షేత్రాలను గురువారం ఐఐఓపీఆర్ సైంటిస్ట్ లు ఎంవీ ప్రసాద్, రామచంద్రుడు, బి.కళ్యాణ్ పరిశీలించారు.
ఎదగని, పూత కాత లేని, నాసిరకంగా ఉన్నవాటిని గుర్తించి, నెంబర్ లు వేసిన చెట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు అవసరం అయిన చెట్ల నుండి నమూనాలు (శాంపిల్ ) ను సేకరించారు. నెంబర్ల వారీగా అధ్యయనం చేసి మరొక్కసారి చెట్లను పరిశీలిస్తాం అన్నారు. ఈ సందర్భంగా ఐఐఓపీఆర్ – పెదవేగి ప్రధాన శాస్త్రవేత్త ఎంవీ ప్రసాద్ మాట్లడుతూ.. మంచిగా ఉన్నా చెట్లు నమూనాలను, జన్యు లోప మొక్కలు నమూనాలను సేకరించి, శాస్త్రీయ పరిశోధన అనంతరం నివేదిక అందిస్తామని అన్నారు.
వారి వెంట ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ ఏ.కిరణ్, జిల్లా ఇంచార్జి రాధాక్రిష్ణ, హెచ్ ఆర్ఎస్ సైంటిస్ట్ ఆండ్ హెడ్ విజయ్ క్రిష్ణ లు పాల్గొన్నారు. ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ అద్యక్షులు తుంబూరు మహేశ్వరరెడ్డి ఉన్నారు.