Friday, May 9, 2025
Homeఖమ్మంమద్దికొండలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

మద్దికొండలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: సాగులో మెలుకువలు,యాజమాన్య పద్దతులు పై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో,స్థానిక వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని అనే కార్యక్రమం గురువారం మండలంలోని మద్ది కొండ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇందులో రైతులు,మహిళలు, ఉపాధ్యాయులు,యువత, పాఠశాల విద్యార్థులు అశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా భూసార పరీక్ష, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం,నీటిని ఆదా చేయడం, చెట్లను పెంచడం, రసీదులు ను భద్రపరచడం పంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని ఆయిల్ తోటలను సందర్శించి నీటి మరియు ఎరువుల యాజమాన్యం గురించి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఆచార్యులు డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ నీలిమ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలను చర్చించడం గురించి రైతులు హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేపట్టాలని వారు ఆశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -