పర్యటనా వివరాలు ఇవే…
నవతెలంగాణ – అశ్వారావుపేట: సాగులో మెలుకువలు, యాజమాన్యం పద్దతులపై గ్రామీణ రైతాంగానికి అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ కళాశాలకు చెందిన 17 మంది శాస్త్రవేత్త 8 బృందాలు గా ఏర్పడి అవగాహనా శిబిరాలు నిర్వహిస్తారని, స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత కుమార్ ఆదివారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాల్లో 48 గ్రామాల్లో ఆరు వారాల పాటు ( మే 5 నుండి జూన్ 13 వరకు) రైతులకు అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు. ఈ అవగాహన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.
షెడ్యూల్ ఇలా…
ఈ (మే) నెల 5వ తేదీ సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ఈ మండలంలోని వినాయకపురంలో
6వ తేది మంగళవారం నారాయణపురం,
7 వ తేదీ బుధవారం అచ్యుతాపురం,
8 న గురువారం అనంతారం,మద్ది కొండ
9 న శుక్రవారం మల్లాయిగూడెం,
12 న సోమవారం నారంవారిగూడెం,
13 న మంగళవారం ఊట్లపల్లి,
15 న గురువారం బచ్చువారిగూడెం,
16 న శుక్రవారం ఆసుపాక,
17 న శనివారం నందిపాడు,
21 వ తేదీ బుధవారం దురదపాడు, గుర్రాల చెరువు,
23 వ తేదీ శుక్రవారం అల్లిగూడెం,
26 వ తేదీ సోమవారం దమ్మపేట మండలం చీపురు గూడెం,
30 వ తేదీ శుక్రవారం కుడుములపాడు,రెడ్డిగూడెం లో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు.
జూన్ 5 వ తేది గురువారం పండువారిగూడెం,6 వ తేదీ శుక్రవారం రాజానగరం,
9 వ తేదీ సోమవారం తిరుమలకుంట,
10 వ తేదీ మంగళవారం ఖమ్మంపాడు,కావడిగుండ్ల గ్రామాల్లో పర్యటించ నున్నట్లు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత కుమార్ శాస్త్రవేత్తల పర్యటనా వివరాలను ఆదివారం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన రైతులను కోరారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES