Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పంటలను సందర్శించిన శాస్త్రవేత్తలు ....

పంటలను సందర్శించిన శాస్త్రవేత్తలు ….

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని కూనూర్,చీమలకొండూర్, చందుపట్ల, వీరవెల్లి గ్రామాల్లోని పంటలను తెలంగాణ రైతు విజ్ఞానం కేంద్రం, భువనగిరి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్, జీవ నియంత్రణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త ఎమ్ రామకృష్ణ బాబు సందర్శించారు.  గత వారం రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, వరి మరియు పత్తి పంటల్లో తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. వరి పొలాల నుండి ఎడతెరిపిలేని వర్షాల వలన చేరిన అధిక నీటిని పొలం నుండి మురుగు కాలువలు ఏర్పాటు చేసుకొని తీసివేయాలి.వరిలో అగ్గి తెగులు ఆశించకుండా పొలం గట్లపై , పొలాల్లో కలుపు లేకుండా చూసుకోవాలి.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లేదా కూలీల కొరత వల్ల సకాలంలో రైతులు కలుపు  నిర్మూలించలేకపోయారు. వరి నాటిన 25 రోజులకు గడ్డి జాతి,తుంగజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు,ఎకరానికి 8 గ్రాముల మెట్ సల్ఫ్యురాన్ మిథైల్ 20% మరియు క్లోరిమ్యురాన్ ఇథైల్ 10 % మిశ్రమం  లేదా 500 మి.లీ. ఫ్లోర్ పైరాక్సీఫెన్ బెంజైల్,  సైహలోఫాప్  బ్యూటైల్ మిశ్రమం , లేదా ఫ్లోర్ ఫైరాక్సీఫెన్ బెంజైల్ మరియు  పెనాక్సులం  కలుపు మందులను పిచికారి చేయాలి.

 వరి నాటి 15 రోజులు గడచిన పొలాల్లో, పిలకలు వేయు లేదా దుబ్బు చేసే దశలో ఉన్న పొలాల్లో, కాండం తొలుచు పురుగు (మొగి పురుగు లేదా ఊసతిరుగు పురుగు) నివారణకు, 1 ఎకరానికి 10 కిలోల కార్బో ఫ్యూరాన్  3 జి గుళికలను లేదా 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలను లేదా 4 కిలోల క్లోరాoట్రానిలీప్రోల్ 0.4 జి గుళికలను గాని ఇసుకలో కలిపి వెదజల్లాలి. వర్షాలు ఆలస్యంగా రావడం వలన గాని, నీటి ఎద్దడి వలన గాని, కొన్ని ప్రాంతాల్లో ముదురునారు సమస్య ఉంది. ముదురు నారు నాటే రైతులు జాగ్రత్తలు పాటించాలి.

నారు కొనలు తుంచి కుదురుకు 6 నుండి 8 మొక్కలు చొప్పున చదరపు మీటరుకు 66 మొక్కలు ఉండేటట్లు వరుసకు వరుసకు మధ్య 15 సెం.మీ ఎడంతో వరుసల్లోని మొక్కల మధ్య  10 సెం.మీ ఎడం ఉండేటట్లు నాటుకోవాలి. ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువులు సిఫారసు కంటే 25% పెంచి మూడు దఫాలుగా గాక రెండు దఫాలుగా అంటే 70% నాటే సమయంలో మిగతా 30% అంకురం దశలో వాడాలి.   ప్రస్తుతం ప్రత్తి పంట శాకీయ దశ నుండి పూత, పిందె దశలో ఉంది. ప్రత్తిపంట నుండి మురుగునీటిని తీసివేసి,వర్షం తగ్గిన తర్వాత పంట త్వరగా కోలుకోవడానికి ఎకరానికి 2 కిలోల 13-0-45 లేదా యూరియా లేదా 4 కిలోల డి.ఏ.పి ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.

వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా , 10 కిలోల పొటాష్ ను కలిపి వేసుకోవాలి. వివిధ రకాల ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు, ఒక ఎకరానికి 200 మీ.లీ ప్రోపికోనజోల్  లేదా 200 గ్రాముల కాప్టాన్ మరియు హెక్సాకోనజోల్ మిశ్రమాన్ని 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు, లోతట్టు భూములలో, మురుగునీటి వసతి లేని భూములలో మరియు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఆశించే వడలు తెగులు నివారణకు ఎకరాకు 600 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదా 200 గ్రాముల కార్బెండాజిమ్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

   ప్రస్తుతము ప్రత్తి పంటను ఆశిస్తున్న రసం పీల్చే పురుగులైన పచ్చదోమ,తెల్లదోమ, తామర పురుగు మరియు పేనుబంక నివారణకు ఎకరానికి ఒక లీటరు 1500 పిపిఎం వేప నూనె లేదా 400 మీ.లీ. ఫిప్రోనిల్ లేదా 60 గ్రాముల ఫ్లోనికామిడ్  లేదా 50 మీ.లీ ఇమిడాక్లోప్రిడ్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad