ఇటలీపై 73 పరుగులతో గెలుపు
కోల్‌కతా : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆఖరు నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్.. గ్రూప్ దశలో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఓడినా.. సోమవారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో ఇటలీపై 73 పరుగులతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ ఛేదనలో ఇటలీ 16.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. స్కాట్లాండ్ పేసర్ మైకల్ లీస్ (4/17), మార్క్ వాట్ (2/24) ఇటలీ బ్యాటర్లను వణికించారు.
ఇటలీ తరఫున బెన్ మానెటి (52, 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సె (84, 54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రాండనన మెక్‌ములన్ (41, 18 బంతుల్లో 4 సిక్స్‌లు), మైకల్ లీస్ (22 నాటౌట్, 5 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. గ్రూప్ దశలో రెండు మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్ ఓ విజయం సాధించగా.. ఇటలీ తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది.



