జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణ
నవతెలంగాణ – బోనకల్
ప్రభుత్వ ఆస్త్రులలో కాన్పల సంఖ్య పెంచాలని, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ వెంటనే పూర్తి చేయాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణ కోరారు. ఖమ్మం జిల్లా మధ్యర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆశ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణ, ఎన్ హెచ్ ఎం – డి పి ఓ దుర్గ, హెచ్ ఇ ఓ సత్యనారాయణ మాట్లాడారు.
డాక్టర్ అరుణ మాట్లాడుతూ ఆన్లైన్ చేయుటలో సిబ్బంది కి ఉన్న సందేహాల పై అవగాహన కల్పించారు. డ్రగ్ స్టాక్ పోసిషన్ ఎప్పటికపుడు చూసుకుంటూ, అవసరమైనపుడు ఇండెంట్ పెట్టుకొని అందరికీ సకాలం లో మందులు అందేలా చూసుకోవాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా ఈనెల 13వ తేదీన స్పెషల్ లిస్టు క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
అనంతరం మహిళా దినోత్సవం వేడుకలలో భాగంగా బోనకల్ గ్రామ సర్పంచ్ బానోత్ జ్యోతిని శాలువాతో సన్మానించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ కేడర్ లలో పనిచేస్తున్న సిబ్బంది, ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక వైద్యాధికార వేముల స్రవంతి హెల్త్ సూపర్వైజర్లు టీ స్వర్ణమార్తమ్మ, శోభ, నర్సింగ్ ఆఫీసర్లు ఉదయశ్రీ అనూష, రమాదేవి, ఫార్మసి ఆఫీసర్ మిరియాల రాధాలత, ఎన్సిడి డిడిఎం నరేంద్ర చారి ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



