Saturday, January 31, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన ముగింపు

రాయికల్ మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన ముగింపు

- Advertisement -

-3 తిరస్కరణ,26 డూప్లికేట్లు రద్దు
నవతెలంగాణ – రాయికల్

రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం నామినేషన్లలో 3 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 26 డూప్లికేట్ నామినేషన్లు రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కె. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన 71 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.

పార్టీల వారీగా చూస్తే బీజేపీ నుంచి 18,కాంగ్రెస్ నుంచి 26,బీఆర్ఎస్ నుంచి 18,జనసేన నుంచి 6 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా,3 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -