నవతెలంగాణ న్యూఢిల్లీ: సీగ్రామ్ వారి రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తమ కొత్త బ్రాండ్ కాంపైన్, లివ్ ఇట్ లార్జ్ ప్రారంభోత్సవం గురించి ప్రకటించింది. బ్రాండ్ ప్రయాణంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తూ, ఈ కాంపైన్ విజయానికి దారితీసే మార్గాలను పునర్నిర్వచించడానికి కృషి చేసే- నేటి తరం-జనరేషన్ లార్జ్ నిర్భయమైన, వ్యక్తీకరించే ధోరణిని సజీవింగా చూపించింది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, బాద్షా, సిద్ధార్థ మల్హోత్ర, నాగ చైతన్య, పాయల్ ధరే వంటి దిగ్గజాల మిశ్రమం కాంపైన్ లో కనిపిస్తారు, ప్రతి ఒక్కరు బ్రాండ్ లివ్ ఇట్ లార్జ్ సిద్ధాంతం నిర్భయమైన ధోరణి, ఆత్మవిశ్వాసంతో కూడిన స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచారు.
ఆధునిక భారతదేశపు ఆకర్షణీయమైన సంబరం ‘ల్యాండ్ ఆఫ్ లార్జ్‘ నేపధ్యంలో రూపొందించబడిన ఈ కాంపైన్ భారతదేశంలోని ప్రతి ప్రాంతం తమదైన సంస్కృతిక దృష్టితో ‘లివింగ్ ఇట్ లార్జ్‘ ఎలా జీవిస్తుందో ప్రదర్శించడానికి వివిధ ప్రాంతాల ద్వారా ప్రయాణిస్తుంది : దీనిలో భాగంగా ఉత్తర భారతదేశపు స్టైల్ నుండి దక్షిణ భారతదేశంలో టెక్, సంబరాల మిశ్రమం, తూర్పులో సంగీతం, పశ్చిమంలో గ్రామీణ వైభవం వరకు ఉంటుంది. ఇక్కడ వైభవంగా జీవించడమే ఏకైక మార్గం అనే సాహసోపేతమైన నమ్మకానికి ప్రతి క్షణం ప్రతిరూపంగా నిలిచింది. తాజా, ఆకర్షణీయమైన, సాంస్కృతికంగా సూక్ష్మమైన దృష్టి ద్వారా ఆధునిక భారతదేశం సారాంశాన్ని ఫిల్మ్ ప్రదర్శిస్తుంది, పెద్ద కలలు కనండి. వైభవంగా జీవించండి అని దేశాన్ని ప్రేరేపిచడాన్ని కొనసాగించే బ్రాండ్ గా రాయల్ స్టాగ్ స్థానాన్ని పునః శక్తివంతం చేస్తోంది.
ఈ విభిన్నమైన ప్రాంతీయ సంబరాలు ద్వారా, ఈ కాంపైన్ ఫిల్మ్ బ్రాండ్ నినాదం- “ఇక్కడ కేవలం వైభవం మాత్రమే ఉంటుంది ( యహా బస్ లార్జ్ చల్తా హై) “- వాస్తవం చేసింది- భారతదేశపు న్యూ జనరేషన్- జనరేషన్ లార్జ్, నిరంతర ఉత్సాహం, ఆశావాదం చూపిస్తుంది. దీనిలో లక్ష్యం ఎన్నో రూపాలను తీసుకుంటుంది. విజయం అనేది కేవలం ఒక మార్గానికి పరిమితం కాదు. ప్రేరణ కోసం రాయల్ స్టాగ్ ఒక ప్రేరేపకం బాధ్యతవహించింది, తాము ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, తాము సాధించవలసిన కలల్ని అనుసరించడానికి లక్షలాదిమంది ప్రజలను ప్రోత్సహిస్తోంది. జనరేషన్ లార్జ్ కి కాంపైన్ చేరుకుని, హృదయానికి తాకేలా నిర్థారించడానికి కాంపైన్ టివి, డిజిటల్, ప్రింట్, OOHలో అత్యంత ప్రభావవంతమైన, 360 డిగ్రీల ప్రచారం ద్వారా మరింత శక్తివంతం చేయబడుతుంది.
దేబాశ్రీ దాస్ గుప్తా, ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, పెర్నాడ్ రికార్డ్ ఇండియా “ కలలు కనడం, సాధించడం, వైభవంగా జీవించడం (లివింగ్ ఇట్ లార్జ్) స్ఫూర్తిని రాయల్ స్టాగ్ ఎల్లప్పుడూ సంబరం చేస్తుంది. మా కొత్త కాంపైన్ తో మేము ఈ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నాం- నేటి జనరేషన్ ఉత్సాహం, అభిరుచి, సాంస్కృతిక ఆకర్షణను తీసుకుంటూ, ఈ కొత్త తరం, జనరేషన్ లార్జ్ స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తుంది. లివింగ్ ఇట్ లార్జ్ అనేది ఒక నిర్వచనానికి కట్టుబడి ఉండటం కాదు- మీ ప్రయాణాన్ని మీ సొంతం చేసుకోవడం గురించి అని వివిధ ప్రాంతాలు, రంగాలకు చెందిన ఆరుగురు దిగ్గజాలకు ఒక చోట చేర్చి, మేము చూపిస్తున్నాము. భారతదేశంలో ప్రతి ప్రాంతం తమ సొంత సంస్కృతిక దృష్టి ద్వారా లక్ష్యాన్ని సంబరం చేస్తోంది అని ఈ కాంపైన్ చూపిస్తోంది. ఓ బ్రాండ్ ఒక కాటగిరి నాయకుడి స్థాయి నుండి ఒక సాంస్కృతిక దిగ్గజంగా అభివృద్ధి చెందుతూ ఉన్నతంగా ఆలోచించడానికి, వైభవంగా కలలు కనడానికి, విలాసంగా జీవించడానికి భారతదేశాన్ని ప్రేరేపిస్తూ కొనసాగే దాని పరివర్తన ప్రయాణానికి ఇది మరింత ప్రోత్సాహాన్నిస్తుంది.”అన్నారు.
క్రికెటర్ రోహిత్ శర్మ మాట్లాడుతూ “లివ్ ఇట్ లార్జ్ కేవలం ఒక నినాదం కాదు-అది ఒక సిద్ధాంతం. ఇది ప్రధానమైన సమయంలో ముందడుగు వేయడం గురించి, పరిస్థితులు మీకు అనుకూలంగా లేని సమయంలోకూడా మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం గురించి, ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం గురించి. ఈ కాంపైన్ నన్ను ప్రతిబింబిస్తోంది ఎందుకంటే ఇది చిన్నగా ఉండటానికి తిరస్కరించే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుంది- అది మైదానంలో కావచ్చు , లేదా జీవితంలో కావచ్చు” అన్నారు.
నటుడు సిద్ధార్థ మల్హోత్ర “ రాయల్ స్డాగ్ అనేది నేను విశ్వసించే దాని గురించి, కొత్త విషయాలను ప్రయత్నించే ధైర్యం మరియు లివ్ ఇట్ లార్జ్ ని ప్రోత్సహించడం గురించి. అది ఒక బ్రాండ్ కంటే అధికం, అభిరుచి, లక్ష్యం, తదుపరి స్థాయికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడం సంబరం చేసే ధోరణది అది. పెద్ద కలలు కని, వైభవంగా జీవించడానికి ప్రజలను ప్రేరేపించే ప్రయాణంలో భాగంగా ఉండటానికి నేను ఉత్సాహంగా ఉన్నాను”చెప్పారు.
ర్యాపర్ బాద్షా “ లివింగ్ ఇట్ లార్జ్ అనగా ఎలాంటి సందేహం లేకుండా మీరు నిజరూపాన్ని సొంతం చేసుకోవడం. మీరు ఎక్కడ నుండి ప్రారంభించారు అనేది ప్రధానం కాదు- ఆత్మవిశ్వాసం మీతో పాటు తీసుకువెళ్లే ఆ శ్రమ ప్రధానమైనది. రాయల్ స్టాగ్ ఆ అదే నమ్మకం కోసం నిలిచింది,అందుకే నాకు అది నచ్చింది. మొత్తం మనం అందరం కలిసికట్టుగా వ్యక్తిత్వాన్ని సంబరం చేసుకోవడానికి తమదైన విధానంలో తమ ప్రయాణాన్ని కొనసాగించేలా ప్రజల్ని ప్రోత్సహించడానికి మేము ఇక్కడ ఉన్నాము”అని అన్నారు.
రైజ్ వరల్డ్ వైడ్ చే ప్రత్యేకంగా నిర్వహించబడిన ఇండియన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా“నా అభిప్రాయంలో, వైభవోపేతంగా జీవించడం అంటే ప్రతి రోజూ క్రమశిక్షణతో, కష్టమైన సమయాల్లో కూడా నమ్మకాన్ని కోల్పోకుండా, మన కు ఉన్నది అంతా ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ప్రతిరోజూ సంపూర్ణంగా జీవించడం. రాయల్ స్టాగ్ వారి లివ్ ఇట్ లార్జ్ కాంపైన్ ఆ మనస్థత్వం సూచిస్తుంది – అది కేవలం పెద్ద క్షణాల గురించి కాదు, ప్రతి ఒక్క దానిని మీరు ఎలా నిర్వహించారు” అని అన్నారు.
నటుడు నాగ చైతన్య “రాయల్ స్టాగ్ సంస్కృతిలో తన మూలాలను ఉంచుతూనే నిరంతరంగా అభివృద్ధి చెందే ఒక బ్రాండ్, ఇదే అంశం నేటికీ దీనిని తగిన విధంగా నిలబెట్టింది. నేను ఈ సిద్ధాంతంతో నిజంగా అంగీకరిస్తాను. ఈ విలువలను సూచించే, నేటి యువతతో ఎంతో అర్థవంతంగా కలిసిపోయే బ్రాండ్ లో భాగంగా ఉండటానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను”అని అన్నారు.గేమర్ పాయల్ ధరే “ప్రతి అభిరుచి కలిగిన కలలు కనే వ్యక్తిని ప్రోత్సహించే నిర్భయమైన స్ఫూర్తిని రాయల్ స్టాగ్ ప్రతిబింబిస్తుంది. నాకు, నా అభిరుచి నా వృత్తిగా మారింది. నేను హద్దులు చెరిపేసాను, మూస రకాలను సవాలు చేసాను. నా సొంత పద్ధతులలో విజయానికి మార్గం వేసాను. నాకు, వైభవోపేతంగా జీవించడం అంటే ప్రతి అవకాశం అందుకోవడం, చిన్నదైనా లేదా పెద్ద అయినా ప్రతి మైలురాయిని సంబరం చేయడం. ఇది ఏదో ఒక అసాధారణమైన అంశం ప్రారంభం మాత్రమే” అని అన్నారు.



