Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయండీఎంకే, మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం

డీఎంకే, మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం

- Advertisement -

ప్రారంభమైన చర్చలు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లపంపకాలు ప్రారంభమయ్యాయి. పాలక డీఎంకే ఆదివారం మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించింది. చెన్నైలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) పార్టీ ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో ఆ పార్టీ నేతలతో డిఎంకె సీట్ల భాగస్వామ్య కమిటీ చర్చలు నిర్వహించింది. 2021 ఎన్నికల్లో మూడు స్థానాలకు పరిమితమైన ఐయూఎంఎల్‌ ఇప్పుడు ఐదు సీట్లను అభ్యర్థిస్తోందని, అయితే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి హయాంలో ముస్లిం రాజకీయ పార్టీలకు 16 స్థానాలు కేటాయించారని, ఇప్పుడు ఐదు స్థానాలను కోరుతున్నామని ఐయూఎంఎల్‌ నేత ఖాదర్‌ మొహిదీన్‌ పేర్కొన్నారు. కనీసం నాలుగు స్థానాలైనా కేటాయిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఐయూఎంఎల్‌ కేవలం రాజకీయ పార్టీ కాదని, తమిళనాడులోని జమాత్‌లకు ప్రాతినిథ్యం వహించే సామాజిక -రాజకీయ సంస్థ అని అన్నారు.

తాము ఖురాన్‌, ప్రవక్తసూక్తులు, భారత రాజ్యాంగం మధ్య సమతుల్యతను కాపాడుకుంటామని, ముస్లిం సంస్థలకు 16 సీట్లు కావాలని అన్నారు. అయితే 2021 ఎన్నికల్లో ఐయుఎంఎల్‌ తనకు కేటాయించిన మూడు స్థానాల్లో విజయం సాధించలేకపోయిందని డీఎంకే కమిటీ అధ్యక్షుడు టి.ఆర్‌.బాలు పేర్కొన్నారు. మిత్ర పక్షంలోకి కొత్తగా ప్రవేశించిన దేశీయ మర్పొక్కు ద్రవిడ కజగం (విజరుకాంత్‌ పార్టీ) కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీలకు సీట్లు కేటాయించాల్సి వుందని టి.ఆర్‌.బాలు పేర్కొన్నారు. దీంతో కొన్ని సీట్లను త్యాగం చేయాలని మిత్రపక్షాలను అభ్యర్థించారు. డీఎంకే సైతం కొన్ని సీట్లను త్యాం చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఆదివారం సాయంత్రం డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ సమావేశం కానున్నారు. సీట్ల పంపకాల చర్చల బృందానికి అధ్యక్షత వహిస్తున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గిరీశ్‌ చోడంకర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -