నవతెలంగాణ – బిజినెస్ బ్యూరో
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఔషద ఉత్పత్తుల కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూలో ఫ్రెష్ ఈక్విటీ ద్వారా రూ.285 కోట్లు, ఓఎఫ్‌ఎస్ ద్వారా 35 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా మొత్తంగా రూ.425 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి మూడో వారంలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చే అవకాశం ఉందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఇక్విటీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్ కానున్నాయి. పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదంతో సాయి పేరెంటరల్స్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి కాబోతుందని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. త్వరలోనే ఐపీఓ తేదీలు, షేర్ల ధరల శ్రేణీ ఇతర అంశాలను వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.
సాయి పేరెంటరల్స్ ఐపీఓకు సెబీ అనుమతి
- Advertisement -
- Advertisement -



