Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వర్ణగిరిలో రెండో రోజు బ్రహ్మోత్సవాల వేడుకలు

స్వర్ణగిరిలో రెండో రోజు బ్రహ్మోత్సవాల వేడుకలు

- Advertisement -

 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో రెండవ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రాన్ని దగదగా మెరిసే విద్యుదీపాలతో అలంకరించారు. నేటి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.  అందులో భాగంగా మంగళవారం రోజు అన్యోన్య దాంపత్యం కొరకు లక్ష్మీనారాయణ ఇష్టిహవనంను నిర్వహించారు. నేడు దేవాలయానికి అళ్వార్ తిరునగిరి ఎంబెరుమానర్ జీయర్ మఠం రంగా రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రంలో ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడుని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా  సుమారు 3000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -