– 22న ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ -కంటోన్మెంట్
అన్ని రాష్ట్రాల వారసత్వ సంపదలైన కళారూపాలు, కళాకారుల ప్రదర్శనలతో భారతీయ కళామహోత్సవ్ రెండో విడత కార్యక్రమం ఈ నెల 22 నుంచి 30 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్నట్టు మేనేజర్ డాక్టర్ రజనీప్రియ, పీఆర్‌ఓ కుమార్ సమ్‌రేష్ తెలిపారు. బుధవారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రెండోసారి నిర్వహిస్తున్న భారతీయ కళామహోత్సవ్ ఉత్సవాలను ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మహోత్సవ్‌ను దేశ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందించామన్నారు. సాంస్కృతిక, పర్యాటక, జౌళి మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ కళామహోత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, దాద్రా నగర్- హవేలి, దామన్-డయ్యూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కళాకారుల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చెప్పారు. అనంతరం కళామహోత్సవ్ పోస్టర్‌ను విడుదల చేశారు.
రాష్ట్రపతి నిలయంలో రెండో విడత కళా మహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



