- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా బుధవారం భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. విరాట్ కోహ్లీ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ భారత్‌దే అవుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతుంది.
- Advertisement -



