- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలో శనివారం రెండో విడత సీఎం ర్యాలీని ఎంపీడీవో నాగేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు ఎంపీడీవో నాగేశ్వర్ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్, ఎంఈఓ ఆనంద్ రావు, ఎంపీవో తిరుపతిరెడ్డి, స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


