– కడెంలో పూడికతీత సక్సెస్
– బాక్రానంగల్ నుంచి
– ఎస్‌ఆర్‌ఎస్పీ వరకు అదే దుస్థితి
– ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మట్టితో పేరుకుపోయిన ప్రాజెక్టులలో రెండోదశ పూడిక తీత పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులకు ఉపక్రమిస్తే, సమద్ధిగా నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మట్టితో పూడిపోయిన ప్రాజెక్టుల్లో నీటి సామర్ధ్యం పూర్తిగా పడిపోవడంతో జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా పరిణమించిందని గుర్తు చేశారు. జాతీయస్థాయిలో ఏర్పడ్డ ఈ సంక్షోభం నుంచి బయట పడి రైతాంగానికి నీటి భద్రత కల్పించేందుకు గాను కేంద్రం జాతీయస్థాయిలో తీసుకొచ్చిన పూడిక తీత విధానాన్ని తెలంగాణా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పూడిక తీత పనులకు అంకురార్పణ చుట్టిందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతనంగా నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఇ.శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాస్, ఇఎన్సీ రమేష్ బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక బాక్రా నంగల్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు మట్టితో పూడిపోయి నీటిసామర్ద్యం నిలువ లు పడి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 120 టీఎంసీల్లో సామర్ధ్యం నుంచి ఏకంగా 80 టీఎంసీలకు పడిపోయిందన్నారు. మట్టితో లేదా ఇసుక మేటలతో ప్రాజెక్టులు పడిపోయి నీటి సామర్ధ్యం నిలువలు ఘోరంగా పడిపోయి ఇది జాతీయ స్థాయి సమస్యగా పరిణమించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే మొదటిదశలో చేపట్టిన పూడికతీత పనులు జాతీయస్థాయిలో మార్గదర్శకాలతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.పూడికతీత పనులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనలు పెట్టనున్నట్టు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న పూడికతీత పనులను ఆయన ప్రస్తావిస్తూ పైలెట్ ప్రాజెక్ట్ కింద ”కడెం” ప్రాజెక్టులో మొదటి దశ లో చెపట్టిన పూడిక తీత విజయవంతమైందన్నారు. ఇక్కడ పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో ఉండాల్సిన నీటి సామర్ధ్యం నిలువలు, వర్షాల ఉధతికి వచ్చి చేరే నీటితో ఏర్పడ్డ నీటినిలువలు సమగ్రంగా అధ్యయనంచేసి అంతిమ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు.
ప్రాజెక్టుల్లో సత్వరమే రెండోదశ పూడికతీత పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



