Sunday, December 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన రెండో విడత పోలింగ్

ముగిసిన రెండో విడత పోలింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈనెల 11న‌ మొద‌టి విడ‌త పంచాయ‌తీ పోలింగ్ ముగిసిన విష‌యం తెలిసిందే. తాజాగా తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్​చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు.

సెకండ్ ఫేజ్‎లో భాగంగా 193 మండలాల్లోని 3 వేల 911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అదే విధంగా ఈనెల 17న‌ మూడో విడ‌త‌తో పంచాయ‌తీ పొలింగ్ ముగియ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -