No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంరాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఛాయాచిత్ర పోటీల్లో నవతెలంగాణ ఫొటో జర్నలిస్టు కె.నరహరికి రెండో బహుమతి

రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఛాయాచిత్ర పోటీల్లో నవతెలంగాణ ఫొటో జర్నలిస్టు కె.నరహరికి రెండో బహుమతి

- Advertisement -

నేడు ప్రదానం చేయనున్న మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని (ఆగస్టు 19) పురస్కరించుకుని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఛాయాచిత్రాల పోటీల్లో నవతెలంగాణ సీనియర్‌ ఫొటో జర్నలిస్టు కె.నరహరి తీసిన ఈ చిత్రానికి రెండో బహుమతి దక్కింది. ఈనెల ఒకటిన నిర్వహించిన నవతెలంగాణ దినపత్రిక దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా సీఎం, మంత్రి పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ (ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు మధ్య నవ్వుల పువ్వులు విరిశాయి. ఆ సమయంలో నరహరి తన కెమేరాకు పని చెప్పటంతో ఈ ఆహ్లాదకరమైన చిత్రం సాక్షాత్కారమైంది. మంగళవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నరహరి బహుమతిని అందుకోనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad