Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుSecond Saturday: ప్రయివేట్ స్కూల్స్ రెండవ శనివారం సెలవు ఇవ్వాలి

Second Saturday: ప్రయివేట్ స్కూల్స్ రెండవ శనివారం సెలవు ఇవ్వాలి

- Advertisement -




– TPTLF, SFI, DYFI డిమాండ్

నవతెలంగాణ హైదరాబాద్: ప్రయివేట్, కార్పోరేట్ స్కూల్స్ రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలి. ఫీజుల దోపిడీ నియంత్రణకు చట్టం చేయాలని, పేద విద్యార్థులకు ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని కోరుతూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF), భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నవీన్ నికోలస్ కు వినతి పత్రం అందజేశారు. దీనిపై డైరెక్టర్ నవీన్ నికోలస్ సానుకూలంగా స్పందించారు. డీఈఓలకు ఆర్డర్స్ ఇస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న కొన్ని ప్రయివేట్ స్కూల్స్ రెండో శనివారం సెలవు ఇవ్వాల్సి ఉండగా చాలా పాఠశాలలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ స్కూల్స్ అన్నీ సెలవులు ఇస్తుండగా ప్రయివేట్ స్కూల్స్ సెలవులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. ప్రయివేట్ కార్పోరేట్ స్కూల్స్ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కింద పని చేయడం లేదా? వారికీ సెపరేట్ బోర్డు ఉందా? ప్రత్యేక రూల్స్ ఏమైనా ప్రయివేట్ స్కూల్స్ కోసం ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ప్రయివేట్ స్కూల్స్ లో పని చేసే టీచర్స్ ప్రతీ రోజు ఎనిమిది గంటల నుండి తొమ్మిది, పది గంటలు విరామం లేకుండా పనిచేస్తున్నారు. అంతే కాక పరీక్షాపత్రాలు, ఇతర వర్క్ కోసం ఇంటి వద్ద కూడా అదే పని చేస్తూనే ఉంటున్నారు. ఎంతో పని ఒత్తిడితో ప్రతీ టీచర్ పనిచేస్తుండగా వారికి దొరికిన ఒక్క రెండు సెలవులు కూడా ఇవ్వకుండా పిండి పిప్పి చేయడం అన్యాయమని అన్నారు.

అలాగే విద్యార్థులకు కూడా సిలబస్ అధికంగా ఉండటం, హోం వర్క్ లు, ఇతర ప్రిపరేషన్ పేరుతో అధిక వత్తిడి ప్రయివేట్ స్కూల్స్ లో ఉంటూనే ఉంటుంది. దొరికిన సెలవుల్లోనే వారు ఆటలు, ఇతర పనుల్లో మరలటం ఎంతో అవసరం. అందుకే ఈ సెలవు విద్యార్థులతోపాటు, టీచర్స్ కి మరింత అవసరమే అని వారు తెలిపారు. కావున ప్రయివేట్ రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. డెరైక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఆర్డర్స్ ఇస్తామని నాయకులకు హమీ ఇచ్చారు. ప్రయివేట్, కార్పోరేట్ స్కూల్స్ రెండో శనివారం తప్పక సెలవు ఇవ్వాలని వారు కోరారు. లేకపోతే ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

అలాగే రాష్ట్రంలో ప్రయివేటు, కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు 70% మాత్రమే విద్యార్థులకు వచ్చాయని, మిగతా పెండింగ్ పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. ప్రయివేటు విద్యాసంస్థల పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వ టీచర్లు మాదిరిగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో TPTLF రాష్ట్ర కన్వీనర్ ఏ. విజయ్ కుమార్, SFI రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, అధ్యక్షులు రజనీ కాంత్, DYFI రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, అధ్యక్షుడు కోట రమేష్, TPTLF రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్, డి. సైదులు, పి.విజయ్, SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, DYFI నాయకులు హష్మీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -