Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమ‌ళ్లీ ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

మ‌ళ్లీ ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భలు వాయిదాపడ్డాయి. సభలో ఎస్‌ఐఆర్‌, పెహల్గామ్‌ ఉగ్రదాడి వంటి అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని సభలోని వెల్‌లో దూసుకురావడంతో.. స్పీకర్‌ ఓంబిర్లా వ్యతిరేకించారు. ఈ అంశాలపై క్వశ్చన్‌ అవర్‌లో చర్చిద్దామని స్పీకర్‌, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రతిపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. అయినాసరే ప్రతిపక్ష ఎంపీలు వారి మాటను వినకుండా చర్చకు పట్టుబట్టడంతో.. స్పీకర్‌ ఓంబిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

మంగళవారం సభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సభా కార్యకలాపాలు నిర్వహించారు. నేడు రాజ్యసభ కూడా ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌లో ఇసి నిర్వహస్తున్న ఎస్‌ఐఆర్‌పై చర్చించడానికి ప్రతిపక్ష ఎంపీలు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad