రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కృతిశెట్టి తదితర స్టార్ హీరోయిన్లకు మేకప్ మ్యాన్‌గా పనిచేసిన ఆయన తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడెమీ’ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ‘ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో కొన్నేళ్లుగా ఉంటూ పనిచేసిన సోదర సమానులు చక్రి తన సొంత మేకప్ స్టూడియోను ప్రారంభించారు.
నా తొలి చిత్రం నుండి సుమారు 8 సంవత్సరాల పాటు మీరు చూసిన అన్ని సినిమాలకు నాకు మేకప్ చేసింది ఆయనే. తను సొంతంగా ఒక మేకప్ అకాడమీ ప్రారంభించడం అనేది ఆయన కల. నేడు ఆ కల నెరవేరింది. భవిష్యత్తులో కూడా ఆయన ఇటువంటి బ్రాంచ్‌లు మరెన్నో ప్రారంభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకు మేకప్ పట్ల ఉన్న నాలెడ్జ్‌తో ఆయన మరింత ముందుకు వెళ్తారనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘సాయం చేయడానికి ఎంతోమంది ఉంటారు కానీ రకుల్ ప్రీత్ ఇంకా ముందుంటారు. ఆమెతో పని చేసేవారు అందరూ బాగుండాలని కుటుంబసభ్యులు లాగా చూసుకుంటారు’ అని కడాలి చక్రవర్తి చెప్పారు.
ఘనంగా సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



