Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం25న యధావిధిగా చలో సచివాలయం

25న యధావిధిగా చలో సచివాలయం

- Advertisement -

– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఉత్తర్వులు రానందున ఈ నెల 25న చలో సచివాలయం కార్యక్రమం యధావిధిగా ఉంటుందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ యూనియన్‌ బృందంతో ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్యదేవరాజన్‌ చర్చలు జరిపారు. తదనంతరం ఐసీడీఎస్‌ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్‌తో సచివాలయంలో రెండో దఫా చర్చలు జరిగాయి. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని విద్యా బోధనా బాధ్యత అంగన్వాడి ఉద్యోగులకే అప్పగింత, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు, వేతనాల పెంపు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, మినీ టీచర్స్‌ పెండింగ్‌ ఏరియర్స్‌, తదితర డిమాండ్లను నెరవేర్చడంపై రాష్ట్ర సర్కారు నుంచి స్పష్టమైన హామీ లభించలేదని సునీత, జయలక్ష్మి తెలిపారు. చర్చల్లో తమ డిమాండ్లపై నిర్దిష్ట ఉత్తర్వులు రాకపోవడంతో 25న తలపెట్టిన చలో సెక్రటేరియట్‌ యధావిధిగా ఉంటుందని ప్రకటించారు. ఆ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ.వెంకటమ్మ, కె. సమ్మక్క రాష్ట్ర నాయకులు సీహెచ్‌.రమా కుమారి, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -