- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను శనివారం ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రెటరీ సీతా లక్ష్మీ సందర్శించారు. ఇటీవల కామారెడ్డి లో జరిగిన వరద ప్రవాహం వలన కళాశాలకు జరిగిన నష్ట ప్రభావాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తగుచూచనలు చేశారు. వరదల వల్ల కళాశాలకు జరిగిన పరిస్థితిని ఆర్సి గంగారం నాయక్, ప్రిన్సిపల్ అన్నపూర్ణ, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సెక్రెటరీ సీత లక్ష్మి కి పరిస్థితిని వివరించారు. ఈ పర్యటనలో సెక్రటరీ సీత లక్ష్మి తో పాటు అడిషనల్ సెక్రెటరీ మాధవి దేవి పరిస్థితిని సమీక్షించారు.
- Advertisement -