Monday, October 13, 2025
E-PAPER
Homeజాతీయంఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్సీఎస్టీ చట్టం సెక్షన్లు నమోదు

ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్సీఎస్టీ చట్టం సెక్షన్లు నమోదు

- Advertisement -

చండీగడ్‌ : హర్యానా ఐపీఎస్‌ అధికారి వై. పూరణ్‌ కుమార్‌ ఆత్మహత్య కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఎస్‌సీఎస్‌టీ చట్టంలోని సెక్షన్లను అదనంగా జోడించారు. ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్లపై పూరణ్‌కుమార్‌ భార్య, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అమ్నీత్‌ పి. కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం, బలమైన సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ను సవరించాలని చేసిన విజ్ఞప్తి మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చీఫ్‌, చండీగడ్‌ ఐజి పుష్పేంద్ర కుమార్‌ ఆదివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, మరోవైపు పూరణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయానికి ఆయన కుటుంబం ఇంకా అనుమతి ఇవ్వలేదు.

ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో హర్యానా డీజీపీ శత్రుజీత్‌ కపూర్‌, రోహ్తక్‌ ఎస్‌పీ నరేంద్ర బిజర్నియా తదితర పేర్లును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని అమ్నీత్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌పీ కుంవార్దీప్‌ కౌర్‌కు లేఖ రాశారు. అలాగే, పురణ్‌కుమార్‌ను ఆత్మహత్య చేసుకునే విధంగా రోహ్తక్‌ ఎస్‌పి నరేంద్ర బిజర్నియా ప్రేరేపించారని, ఆయనపై చర్యపై తీసుకోవాలని డిమాండ్‌ మేరకు ఈ నెల 11న హరాన్యా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నరేంద్ర బిజర్నియాను విధుల నుంచి తొలగించింది. ఆయన స్థానంలో రోహ్తక్‌ నూతన ఎస్‌పిగా ఐపిఎస్‌ అధికారి సురీందర్‌ సింగ్‌ బోరియాను నియమించింది. 2001 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన పూరణ్‌కుమార్‌ (52) ఈ నెల 7న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య లేఖలో డీజీపీ, బిజర్నియాతో సహా ఎనిమిది మంది అధికారులు తనపై వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -