Sunday, November 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ గాజా శాంతి ప్రణాళికపై 17న భద్రతా మండలిలో ఓటింగ్‌

ట్రంప్‌ గాజా శాంతి ప్రణాళికపై 17న భద్రతా మండలిలో ఓటింగ్‌

- Advertisement -

ఐక్యరాజ్య సమితి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చొరవతో అమలవుతున్న గాజా శాంతి ప్రణాళికను ధృవీకరిస్తున్న తీర్మానంపై ఈ నెల 17న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఓటింగ్‌ జరుగనుంది. గాజాలో రెండేండ్లుగా సాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్‌ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికను మండలి ధృవీకరించేందుకై గత వారం మండలి పరిధిలోని 15 సభ్య దేశాల మధ్య అమెరికా అధికారికంగా చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు ముసాయిదా తీర్మానం ప్రతి ఒకటి గురువారం మీడియా చేతికి అందింది. గాజాలో తాత్కాలిక పాలనా సంస్థను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆ ముసాయిదా పేర్కొంటోంది.

గాజా స్ట్రిప్‌ను నిస్సైనికీకరణ చేసేందుకు, సరిహద్దు ప్రాంతాలను సురక్షితంగా ఉంచేందుకు కొత్తగా శిక్షణ పొందే పాలస్తీనా పోలీసులతో, ఈజిప్ట్‌, ఇజ్రాయిల్‌తో కలిసి పనిచేసేందుకు ‘తాత్కాలిక అంతర్జాతీయ స్థిరీకరణ శక్తి (ఐఎస్‌ఎఫ్‌)’ని ఏర్పాటు చేసేందుకు సభ్య దేశాలకు ఈ తీర్మానం అధికారమిస్తుంది. భద్రతా మండలి త్వరితంగా ఈ తీర్మానాన్ని ఆమోదించాలని శుక్రవారం అమెరికా, పలు అరబ్‌ ముస్లిం దేశాలు కోరాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి తామందరి సంయుక్త మద్దతు ఉంటుందని అమెరికా, కతార్‌, ఈజిప్ట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), సౌదీ, ఇండోనేషియా, పాకిస్తాన్‌, జోర్డాన్‌, టర్కీలు ఒక సంయుక్త ప్రకటనలో కోరాయి. గాజాలో అంతర్జాతీయ బలగాలను మోహరించరాదని లేదా తాత్కాలిక పాలనా బోర్డును ఏర్పాటు చేయడానికి అధికారమివ్వరాదని మండలి సభ్య దేశాలను కోరుతూ రష్యా పోటీగా ఒక ముసాయిదా తీర్మానాన్ని పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పై దేశాలన్నీ సంయుక్త ప్రకటన వెలువరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -