Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

- Advertisement -

గణేష్ నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

గణేశ్ నవరాత్రులు ముగించుకొని జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి బాసర, ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు . నిమజ్జనం జరిగే ప్రదేశాలను పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సందర్శించారు.అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు , ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో , శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో బాసర , ఉమ్మెడ కు నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడమైనదని తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -